- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Crime News : హైదరాబాద్ లో ఈ- సిగరెట్ల ముఠా అరెస్ట్... విచారణలో సంచలన నిజాలు
హైదరాబాద్(Hyderabad) లో ఈ- సిగరెట్లు(e-Cigaretts) అమ్ముతున్న ఓ ముఠాను తెలంగాణ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(TGNAB) పోలీసులు పట్టుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) లో ఈ- సిగరెట్లు(e-Cigaretts) అమ్ముతున్న ఓ ముఠాను తెలంగాణ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(TGNAB) పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి రాబట్టిన సమాచారం తెలుసుకొని పోలీసులే విస్తుపోయారు. నగరంలో ఈ- సిగరెట్లు, పైప్స్ విక్రయాలు సాగుతున్నట్టు సమాచారం అందుకున్న టీజీన్యాబ్, హైదరాబాద్ పోలీసులు(Hyderabad Police) సంయుక్త దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో నాంపల్లికి చెందిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.25 విలువైన డ్రగ్స్, భారీగా విదేశీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐడీ వాట్సప్ గ్రూప్ ద్వారా వీరు అమ్మకాలు సాగిస్తున్నట్టు గుర్తించారు.
అయితే హైదరాబాద్ నగరంలోని ప్రముఖ విద్యాసంస్థల్లోని విద్యార్థులు, చిన్నారులే లక్ష్యంగా వీరు అమ్మకాలు చేస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. కాగా ఇప్పటికే 500 మందికిపైగా వీటిని విక్రయించినట్టు తేలింది. వీరికి ఢిల్లీ, ముంబై నుంచి డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని గుర్తించిన పోలీసులు.. వారిని కూడా పట్టుకునే పనిలో ఉన్నామని తెలిపారు.






