ఆర్థిక ఇబ్బందులు తాళలేక యువకుడి బలవన్మరణం

by Kema Shiva Kumar |

ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన చిన్నశంకరం పేట మండల పరిధిలోని గవలపల్లిలో గురువారం చోటుచేసుకుంది.

ఆర్థిక ఇబ్బందులు తాళలేక యువకుడి బలవన్మరణం
X

దిశ, చిన్నశంకరంపేట : ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన చిన్నశంకరం పేట మండల పరిధిలోని గవలపల్లిలో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై సుభాష్ గౌడ్ కథనం ప్రకారం.. శాలిపేట గ్రామానికి చెందిన అంజాగౌడ్ (30) కుటుంబం పదేళ్ల సంవత్సరాల క్రితమే గవలపల్లి చౌరస్తాలో టీ స్టాల్ పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. అద్దె ఇంట్లో నివాసముంటున్న అంజాగౌడ్ కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. ఈ క్రమంలోనే అంజాగౌడ్ మస్తాపానికి గురై ఆర్థిక ఇబ్బందులు తాళలేక గురువారం అద్దె ఇంట్లో ఉరేకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తల్లి రాగుల సుజాత ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తును ప్రారంభించారు.

Next Story