పెంచలయ్య హత్య కేసు.. కీలక విషయాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాస్

by Ajay Maddhiboyina |

గంజాయి వ్యాపారానికి అడ్డు వస్తున్నాడని నెల్లూరు జిల్లాలో సీపీఎం కార్యకర్త పెంచలయ్యను నడీరోడ్డుపై దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అరవ కామాక్షి అనే మహిళ గంజాయి వ్యాపారం చేస్తూ ఓ గ్యాంగ్ మెయిన్టైన్ చేస్తూ ఈ దారుణానికి పాల్పడింది.

పెంచలయ్య హత్య కేసు.. కీలక విషయాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాస్
X

దిశ, వెబ్ డెస్క్: గంజాయి వ్యాపారానికి అడ్డు వస్తున్నాడని నెల్లూరు జిల్లాలో సీపీఎం కార్యకర్త పెంచలయ్యను నడీరోడ్డుపై దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అరవ కామాక్షి అనే మహిళ గంజాయి వ్యాపారం చేస్తూ ఓ గ్యాంగ్ మెయిన్టైన్ చేస్తూ ఈ దారుణానికి పాల్పడింది. ఈ కేసుకు సంబంధించి డీఎస్పీ శ్రీనివాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పెంచలయ్య హత్య కేసులో మొత్తం 14మంది ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం 9మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. మిగిలిన ఐదుగురి కోసం గాలిస్తున్నామని అన్నారు.

నిందితుల నుండి 7 మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. గంజాయి, మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు పెంచలయ్య పోరాటం చేసేవాడని అన్నారు. గంజాయి స్మగ్లర్ అయిన కామాక్షి పెంచలయ్యపై కక్ష పెంచుకుందని అన్నారు. తన దందాకు అడ్డు వస్తూ పోలీసులకు సమాచారం ఇస్తున్నాడనే నెపంతో హత్య చేయించిందని చెప్పారు. గంజాయి కేసులో కామాక్షిని అరెస్ట్ చేశామన్నారు. ఇదిలా ఉంటే కామాక్షి రాజకీయనాయకుల అండదండలు, పోలీసుల సపోర్ట్ తోనే గంజాయి వ్యాపారం చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి.

Next Story