- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోచంపల్లిలో కారు బీభత్సం.. లోకేష్ పై కేసు నమోదు..
మద్యం మత్తులో కారు నడిపిన ఓ వ్యక్తి తీవ్ర ప్రమాదానికి కారణమయ్యాడు. స్కోడా కారులో ఉన్న ఉడతల లోకేష్ అనే వ్యక్తి సోమవారం

దిశ, భూదాన్ పోచంపల్లి: మద్యం మత్తులో కారు నడిపిన ఓ వ్యక్తి తీవ్ర ప్రమాదానికి కారణమయ్యాడు. స్కోడా కారులో ఉన్న ఉడతల లోకేష్ అనే వ్యక్తి సోమవారం అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి పోచంపల్లి వైపు వేగంగా వస్తుండగా, భువనగిరి సమీపంలోని సూరపల్లిలో ప్రమాదానికి గురయ్యాడు.
సూరపల్లి భూషణ్ ఇంటి ముందు ఉన్న మెట్లను ఢీకొట్టి, అక్కడి నుంచి అదుపు తప్పిన కారు పక్కనే ఉన్న స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో మూడు ద్విచక్ర వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తూ ఆ సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.
ప్రమాదం జరిగిన కారులో మద్యం సీసాలు ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. కారును నడిపిన లోకేష్‌ను బాధితుడు భూషణ్ ప్రశ్నించగా, అతను దురుసుగా ప్రవర్తిస్తూ దాడికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. భూషణ్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు లోకేష్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై భాస్కర్ రెడ్డి తెలిపారు.






