Drugs Seize: నగరంలో పోలీసుల తనిఖీలు..రూ.25 లక్షల విలువ చేసే హెరాయిన్ సీజ్

by Kema Shiva Kumar |

తెలంగాణ (Telangana)లో డ్రగ్స్ (Drugs) వినియోగం పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది.

Drugs Seize: నగరంలో పోలీసుల తనిఖీలు..రూ.25 లక్షల విలువ చేసే హెరాయిన్ సీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana)లో డ్రగ్స్ (Drugs) వినియోగం పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రాన్ని డ్రగ్స్‌ ఫ్రీ స్టేట్‌ (Drugs Free State)గా చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు డ్రగ్స్ విక్రయిస్తూ.. ఎవరైనా పట్టుబడిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలంటూ పోలీసు శాఖ (Police Department)కు ఆదేశాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే టాస్క్‌ఫోర్స్ (Taskforce), ఎస్‌ఓటీ (SOT), ఇతర పోలీసు సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు (Railway Stations), ఎయిర్‌పోర్టు (Airports)లు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతూ.. ఎక్కడికక్కడ గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకుని కేసులు నమోదు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇవాళ రాచకొండ పోలీస్ కమిషనరేట్ (Rachakonda Police కమిషనరేట్) పరిధిలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు డ్రగ్స్‌ను గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్న ఇద్దరు పెడ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి నుంచి 190 గ్రాముల హెరాయిన్ సుమారు రూ.25 లక్షల విలువ చేసే డ్రగ్, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

Next Story