బాయ్ ఫ్రెండ్‌తో కలిసి యవతి డ్రగ్స్ దందా.. లేడీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరెస్ట్!

by Malleboina Mahesh |

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా సమాజంలో గౌరవప్రదమైన హోదాలో ఉండి, లక్షల్లో జీతం తీసుకుంటున్న ఓ యువతి డ్రగ్స్ రొంపిలోకి దిగడం భాగ్యనగరంలో కలకలం రేపింది.

బాయ్ ఫ్రెండ్‌తో కలిసి యవతి డ్రగ్స్ దందా.. లేడీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరెస్ట్!
X

దిశ, వెబ్ డెస్క్: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా సమాజంలో గౌరవప్రదమైన హోదాలో ఉండి, లక్షల్లో జీతం తీసుకుంటున్న ఓ యువతి డ్రగ్స్ (Drugs) రొంపిలోకి దిగడం భాగ్యనగరంలో కలకలం రేపింది. కాకినాడ నుంచి హైదరాబాద్‌కు వచ్చి ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సుష్మిత, తన బాయ్ ఫ్రెండ్ ఇమాన్యుల్‌ (Emmanuel)తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తూ పోలీసులకు అడ్డంగా బుక్కయ్యింది. విలాసాలకు అలవాటు పడి, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో వీరిద్దరూ కలిసి ఈ డ్రగ్ నెట్‌వర్క్‌ (Drug network)ను నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. చిక్కడపల్లిలో వీరి కార్యకలాపాలపై హెచ్-న్యూ (H-NEW), స్థానిక పోలీసులు మెరుపు దాడి చేసి ఈ ప్రేమ జంటతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ ముఠా వద్ద నుండి సుమారు 4 లక్షల రూపాయల విలువైన మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో అత్యంత ప్రమాదకరమైన ఎండిఎంఏ (MDMA), ఎల్‌ఎస్‌డి (LSD) బాటిల్స్, ఓజీ కుష్ వంటి డ్రగ్స్ ఉన్నాయి. ఉన్నత చదువులు చదివి, బంగారు భవిష్యత్తు ఉన్న యువత ఇలా డ్రగ్స్ దందాలోకి దిగడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిందితులు ఈ డ్రగ్స్‌ను ఎక్కడి నుండి సేకరిస్తున్నారు? వీరికి సహకరిస్తున్న ఇతర ముఠాల వివరాలపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.

Next Story