Drug Gang Arrested: కోయంబత్తూర్‌లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు.. ఏడుగురు అరెస్ట్

by Kema Shiva Kumar |   (  Updated:2025-03-04 03:47:17  IST  )

దేశ వ్యాప్తంగా డ్రగ్స్ (Drugs), గంజాయి (Ganja) వినియోగం విచ్చలవిడిగా పెరుగుతోన్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం (Central Government) అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Drug Gang Arrested: కోయంబత్తూర్‌లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు.. ఏడుగురు అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా డ్రగ్స్ (Drugs), గంజాయి (Ganja) వినియోగం విచ్చలవిడిగా పెరుగుతోన్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం (Central Government) అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్వదేశంలో తయారు అవుతోన్న, విదేశాల నుంచి అక్రమంగా వస్తున్న డగ్స్‌పై స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించి ఉక్కుపాదం మోపాలని సూచించింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న ఎయిర్‌పోర్టులు (Airports), ఓడరేవు (Ports)లను కస్టమ్స్ అధికారులు (Customs officials), నార్కొటిక్ బ్యూరో (Narcotics Bureau) అధికారులు నిత్యం జల్లెడ పడుతున్నారు. అదేవిధంగా ఆయా రాష్ట్రాల్లో అనుమానం వచ్చిన ప్రతి బ్యాగేజీలు, కంటైనర్ల (Containers) ను క్లియర్‌గా చెక్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే కోయంబత్తూరు (Coimbatore) పోలీసులు డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. కొన్నాళ్లుగా కేరళ (Kerala), తమిళనాడు (Tamilnadu) సరిహద్దు కేంద్రంగా విచ్చలవిడిగా డ్రగ్స్ దందా కొనసాగుతోంది. ముఖ్యంగా కాలేజీకి వెళ్లే విద్యార్థులే టార్గెట్‌గా డ్రగ్స్ పెడ్లర్లు (Drugs Peddlers) రెచ్చిపోతున్నారు. అయితే, పక్కా సమాచారం మేరకు రంగంలోకి దిగిన కోయంబత్తూర్ (Coimbatore) పోలీసులు కేరళ, తమిళనాడు బార్డర్‌లో నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే డ్రగ్స్ విక్రయిస్తున్న మొత్తం ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి నుంచి రూ.10 లక్షలు విలువ చేసే నిషేధిత డ్రగ్ ఎల్ఎస్‌డీ (LSD)తో పాటు 2 కార్లు, 2 బైక్‌లు, 10 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Next Story