ఢిల్లీలో DRI అధికారుల తనిఖీలు.. రూ.108 కోట్ల విలువైన డ్రగ్స్‌ సీజ్

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-25 06:20:13  IST  )

దేశ వ్యాప్తంగా విచ్చలవిడిగా పెరిగిన డ్రగ్స్ (Drugs) వినియోగం అందరినీ కలవరపెడుతోంది.

ఢిల్లీలో DRI అధికారుల తనిఖీలు.. రూ.108 కోట్ల విలువైన డ్రగ్స్‌ సీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా విచ్చలవిడిగా పెరిగిన డ్రగ్స్ (Drugs) వినియోగం అందరినీ కలవరపెడుతోంది. ఆయా రాష్ట్రాల ఎక్సైజ్ పోలీసులు (Excise Police), యాంటీ నార్కొటిక్ బ్యూరో (Telangana Anti Narcotic Bureau), టాస్క్‌ఫోర్స్ పోలీసులు వరుసగా దాడులు చేపడుతున్న నేపథ్యంలో ఎక్కడో ఒకచోట డ్రగ్స్ (Drugs) పట్టుబడుతూనే ఉన్నాయి. తాజాగా, ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR)లో పెద్ద ఎత్తన డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నారనే సమాచారం మేరకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు, ఢిల్లీ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ చేపట్టారు.

ఈ దాడుల్లో భారీ నార్కోటిక్స్ తయారీ, పంపిణీ నెట్‌వర్క్‌ను వారు ఛేదించారు. ముఖ్యంగా గ్రేటర్ నోయిడా పరిధిలోని ఓ నివాస సముదాయం సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న ఫామ్‌లో రహస్యంగా అంఫెటమైన్ తయారీ యూనిట్‌ను బట్టబయలు చేశారు. నోయిడాతో పాటు వెస్ట్ ఢిల్లీలోని డ్రగ్స్ పంపిణీ కేంద్రంపై ఆకస్మికంగా రెయిడ్ చేశారు. ఈ దాడుల్లో 16.26 కిలోల అంఫెటమైన్, 7.79 కిలలో కొకైన్, 1.87 కిలలో హెరాయిన్, 2 కిలలో అత్యంత శక్తివంతమైన ఓపియాయిడ్, గంజాయితో పాటు సెడేటివ్-హిప్నోటిక్ డ్రగ్, 115.42 కిలోల ప్రీకర్సర్ రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్‌లో పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ.108 కోట్ల ఉంటుందని డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. అదేవిధంగా 26 మంది విదేశీయులను పోలీసుల అరెస్టు చేశారు.

Next Story