పాకిస్తాన్ ఐఎస్‌ఐకి గూఢచర్యం.. DRDO సిబ్బంది అరెస్టు

by Kema Shiva Kumar |

దాయాది పాక్ అనుమానిత గూఢచారిని పోలీస్ సీఐడీ (ఇంటెలిజెన్స్) అదుపులోకి తీసుకున్న ఘటన రాజస్థాన్ (Rajas‌tan) రాష్ట్రంలోని జైసల్మేర్‌ (Jaisalmer)లో ఇవాళ చోటచేసుకుంది.

పాకిస్తాన్ ఐఎస్‌ఐకి గూఢచర్యం.. DRDO సిబ్బంది అరెస్టు
X

దిశ, వెబ్‌డెస్క్: దాయాది పాక్ అనుమానిత గూఢచారిని పోలీస్ సీఐడీ (ఇంటెలిజెన్స్) అదుపులోకి తీసుకున్న ఘటన రాజస్థాన్ (Rajas‌tan) రాష్ట్రంలోని జైసల్మేర్‌ (Jaisalmer)లో ఇవాళ చోటచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహేంద్ర ప్రసాద్ (32) అనే వ్యక్తి చందన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లోని DRDO గెస్ట్‌హౌస్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే, అతడు పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ హ్యాండ్లర్‌తో టచ్‌లో ఉంటూ.. భారత రక్షణ కార్యకలాపాలకు సంబంధించిన కాన్ఫిడెన్షిల్ సమాచారాన్ని లీక్ చేస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. సీఐడీ (సెక్యూరిటీ) ఐజీ డాక్టర్ విష్ణుకాంత్ (Vishnu Kanth) తెలిపిన వివరాల ప్రకారం.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల దృష్ట్యా, రాజస్థాన్ సీఐడీ ఇంటెలిజెన్స్ జాతి వ్యతిరేక, విధ్వంసక కార్యకలాపాలపై నిఘా పెట్టిందని తెలిపారు.

ఈ క్రమంలోనే డీఆర్‌డీఓ గెస్ట్‌హౌస్‌లో కాంట్రాక్ట్ బేస్‌‌లో పనిచేస్తున్న మహేంద్ర ప్రసాద్ గూఢచర్యం గురించి వెలుగులోకి వచ్చిందనన్నారు. అతడి స్వస్థలం ఉత్తరాఖండ్‌లోని అల్మోరాలోని పల్యూన్ అని తెలిపారు. మహేంద్ర ప్రసాద్ ఎవరికీ అనుమానం రాకుండా సోషల్ మీడియా వేదికగా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీతో సంప్రదింపులు జరిపినట్లు దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు. అతడు చందన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌కు క్షిపణి, ఆయుధ పరీక్షల కోసం వచ్చే డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు, భారత సైనిక అధికారుల కదలికల వివరాలను తన హ్యాండ్లర్‌కు చేరవేసినట్లుగా నిర్ధారణ అయిందని అన్నారు. ఈ మేరకు అతడిని అరెస్ట్ చేసి సెల్‌ఫోన్‌ను కూడా సీజ్ చేశామని సీఐడీ (సెక్యూరిటీ) ఐజీ విష్ణుకాంత్ తెలిపారు. మహేంద్ర కుమార్ పాక్ ఐఎస్ఐ‌లో ఎవరితో టచ్‌లో ఉన్నాడు.. ఏం సమాచారం ఇచ్చాడనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Next Story