- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సృష్టి కేసులో తొలిరోజు ముగిసిన డా.నమ్రత విచారణ..ఏం చెప్పిందంటే?
సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో తొలిరోజు డాక్టర్ నమ్రత విచారణ ముగిసింది. గోపాలపురం పోలీసులు నమ్రతను విచారించి ప్రశ్నల వర్షం కురిపించారు.

దిశ, వెబ్ డెస్క్: సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో తొలిరోజు డాక్టర్ నమ్రత విచారణ ముగిసింది. గోపాలపురం పోలీసులు నమ్రతను విచారించి ప్రశ్నల వర్షం కురిపించారు. ముఖ్యంగా చైల్డ్ ట్రాఫికింగ్, సరోగసీకి సంబంధించిన ఆరోపణలపై పోలీసులు ప్రశ్నించారు. చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలతో ఆమె టచ్ లో ఉన్నట్టు పోలీసుల విచారణలో అంగీకరించారు. ఐవీఎఫ్ కోసం వచ్చిన దంపతులను సరోగసీ వైపు ఎందుకు మళ్లించారు అని పోలీసులు ప్రశ్నించగా ఆమె సమాధానం ఇవ్వలేదు.
ఇదిలా ఉంటే సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నుండి సరోగసి ద్వారా బిడ్డను పొందిన ఓ జంట ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. బిడ్డకు క్యాన్సర్ రావడంతో డీఎన్ఏ టెస్ట్ నిర్వహించగా అసలు తమ బిడ్డ కాదని తేలడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సృష్టి బేబీ సెంటర్ లో భారీగా వీర్యం నిల్వలు, అండాల నిల్వలు గుర్తించారు. వాటిని బిక్షగాళ్ల నుండి, రోజువారి కూలీల నుండి సేకరించినట్టు నిర్దారించారు. అంతే కాకుండా బేబీ సెంటర్ పేరుతో చిన్నపిల్లలను కొనుగోలు చేసి సరోగసి పేరుతో విక్రయించినట్టు గుర్తించారు. ఈ కేసులో పూర్తి విచారణ జరిగితే అసలు నిజాలు బయటపడే అవకాశం ఉంది.






