వరకట్న వేధింపులు.. ఐదు నెలల గర్భవతి ఆత్మహత్య..

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఐదు నెలల గర్భవతి ఉరేసుకుని చనిపోయింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఆకాంక్షకు రోహిత్‌ వర్మతో గతేడాది నవంబర్ 17న పెళ్లి జరిగింది.

వరకట్న వేధింపులు.. ఐదు నెలల గర్భవతి ఆత్మహత్య..
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఐదు నెలల గర్భవతి ఉరేసుకుని చనిపోయింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఆకాంక్షకు రోహిత్‌ వర్మతో గతేడాది నవంబర్ 17న పెళ్లి జరిగింది. మంచి కట్నం, కానుకలు ఇచ్చి కూతురిని అత్తారింటికి పంపించారు తల్లిదండ్రులు. కానీ అత్తింటి వారు మాత్రం ఇచ్చిన కట్నంతో సంతృప్తి పడలేదు. దీంతో వేధింపులు మొదలయ్యాయి. ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా టార్చర్ చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ భరించలేకపోయిన ఆకాంక్ష అత్తగారి ఇంట్లో ఉరేసుకుంది. ఈ విషయం పుట్టింటివారికి కూడా లేట్‌గానే తెలిసినట్లు సమాచారం. కాగా మృతురాలి తండ్రి ఉమేష్.. అదనపు వరకట్నం కోసం తన బిడ్డను హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు రోహిత్ వర్మను అరెస్ట్ చేశారు.

Next Story