- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నగరంలో మరో దారుణం.. తల్లి, కొడుకును హత్య చేసిన పనోడు.. గొంతు కోసి.. ఇల్లంతా రక్తంతో..
ఢిల్లీ మహానగరంలో మరో దారుణం చోటు చేసుకుంది. లజ్‌పత్ నగర్-Iలోని బ్లాక్ Fలో 42 ఏళ్ల మహిళ రుచికా సేవానీ, ఆమె 14 ఏళ్ల కుమారుడు కృష్ సేవానీ డబుల్ మర్డర్ నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. తమ గార్మెంట్ షాపులో పని చేసే 24 ఏళ్ల ముకేశ్ పాస్వాన్

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ మహానగరంలో మరో దారుణం చోటు చేసుకుంది. లజ్‌పత్ నగర్-Iలోని బ్లాక్ Fలో 42 ఏళ్ల మహిళ రుచికా సేవానీ, ఆమె 14 ఏళ్ల కుమారుడు కృష్ సేవానీ డబుల్ మర్డర్ నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. తమ గార్మెంట్ షాపులో పని చేసే 24 ఏళ్ల ముకేశ్ పాస్వాన్...ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. నిందితుడిని ఉత్తరప్రదేశ్‌లోని ముఘల్‌సరాయ్‌లో రైలులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
అసలు ఏం జరిగింది?
ముకేశ్ పాస్వాన్ హత్యలకు తనకు జరిగిన అవమానమే కారణమని తెలుస్తోంది. వారం రోజుల పాటు షాప్‌కు రాకపోవడం, తీసుకున్న 45,000 రూపాయల అప్పు తిరిగి చెల్లించకపోవడంపై అతన్ని మందిలించింది రుచిక. ఎంగేజ్మెంట్ ఉందని ఎనిమిది రోజులు సెలవు అడిగిన ముకేశ్.. దాదాపు 27 రోజులు రాలేదు. అయినా డబ్బులు అడుగుతుండటంతో మందలించింది యజమాని. ఈ అవమానంతో ఆ రాత్రి ఇంట్లోకి చొరబడి రుచికా గొంతు కోశాడు. క్రికెట్ కోచింగ్ నుంచి వచ్చిన కృష్.. తల్లి హత్యను చూసి బాత్‌రూమ్‌లో దాక్కునే ప్రయత్నం చేశాడు. కానీ ముకేశ్ అతన్ని కూడా చంపాడు. తర్వాత ఇంటిని దోచుకుని పరారయ్యాడు.
ఆ రాత్రి 9:43 గంటల సమయంలో.. రుచికా భర్త కులదీప్ సేవానీ (44) లజ్‌పత్ నగర్ సెంట్రల్ మార్కెట్‌లోని వారి గార్మెంట్ షాప్ నుండి ఇంటికి వచ్చాడు. మెట్లపై, గేట్ వద్ద రక్తపు మరకలు గమనించి.. భార్య, కొడుకును ఎలా కాపాడుకోవాలో తెలియని పరిస్థితుల్లో.. వెంటనే పోలీసులకు కాల్ చేశాడు. పోలీసులు ఇంటి తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లగా.. బెడ్‌రూమ్‌లో రుచిక, బాత్‌రూమ్‌లో కృష్ గొంతు కోసిన స్థితిలో కనిపించారు. ఇల్లు రక్తంతో నిండిపోయింది. ఫోరెన్సిక్ బృందం సాక్ష్యాలు సేకరించి, CCTV ఫుటేజీని పరిశీలించింది.






