భూ వివాదం.. తల్లీకూతుళ్ల గొంతు కోసి హత్య

by Sujitha Rachapalli |   (  Updated:2025-08-15 11:27:16  IST  )

ఉత్తరప్రదేశ్ బదాయూన్‌లో దారుణం చోటు చేసుకుంది. తల్లీకూతుళ్ల డబుల్ మర్డర్ స్థానికంగా కలకలం రేపుతోంది. దతాగంజ్ పీఎస్ పరిధిలోని బీరంపూర్‌లో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాత్రి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు..

భూ వివాదం.. తల్లీకూతుళ్ల గొంతు కోసి హత్య
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ బదాయూన్‌లో దారుణం చోటు చేసుకుంది. తల్లీకూతుళ్ల డబుల్ మర్డర్ స్థానికంగా కలకలం రేపుతోంది. దతాగంజ్ పీఎస్ పరిధిలోని బీరంపూర్‌లో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాత్రి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు.. రీసెంట్‌గా కట్టుకున్న కొత్త ఇంట్లో నిద్రిస్తుండగా ఈ హత్యలు జరిగాయి. శాంతి దేవి(75) కూతురు జయంతి దేవి(32)కి విడాకులయ్యాయి. ఇంట్లో వీరిద్దరే ఉంటున్నారు. ఈ మధ్య రూ. 50లక్షల విలువ చేసే భూమి అమ్మినట్లు తెలుస్తోంది. దీని కారణంగానే బంధువులతో గొడవలు జరిగాయని సమాచారం. కాగా కక్షతోనే వీరిని హతమార్చి ఉండొచ్చని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. తల్లీకూతుళ్లపై కత్తితో దాడి చేసిన దుండగులు గొంతు కోసి హత్య చేశారు. బయట శాంతి దేవి మేనల్లుడు పడుకోగా.. అతనిపై కూడా ఎటాక్ జరిగింది. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో విషమ పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఫోరెన్సిక్ విభాగం ఘటనాస్థలంలో సాక్ష్యాలను సేకరించినట్లు తెలిపిన పోలీసులు.. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు.

Next Story