- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డాక్టర్ రాసలీలలు.. ఎక్కడ ఏం చూపించాలో అదే చూపించిన నర్స్.. ఇద్దరి వీడియో వైరల్
ప్రభుత్వ ఆస్పత్రిలో లైంగిక వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చింది. హాస్పిటల్‌లో పని చేసే ఓ మహిళా ఉద్యోగిని సెక్సువల్ హరాజ్మెంట్‌కు గురిచేశాడు మెడికల్ ఆఫీసర్. ఈ వేధింపులను తట్టుకోలేని మహిళ పై అధికారులకు ఫిర్యాదు చేసింది. కానీ సరైన చర్యలు తీసుకోలేదు

దిశ, వెబ్ డెస్క్ : ప్రభుత్వ ఆస్పత్రిలో లైంగిక వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చింది. హాస్పిటల్‌లో పని చేసే ఓ మహిళా ఉద్యోగిని సెక్సువల్ హరాజ్మెంట్‌కు గురిచేశాడు మెడికల్ ఆఫీసర్. ఈ వేధింపులను తట్టుకోలేని మహిళ పై అధికారులకు ఫిర్యాదు చేసింది. కానీ సరైన చర్యలు తీసుకోలేదు. దీంతో విషయాన్ని ఇంట్లో చెప్పడంతో.. బంధువులే స్వయంగా రంగంలోకి దిగారు. ఆఫీసులోనే డాక్టర్‌ను చుట్టుముట్టి దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని కౌథా మున్సిపల్ కార్పోరేషన్ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. ఇక్కడ పనిచేసే ఒక మహిళా ఉద్యోగి... డాక్టర్ కుంతూర్కర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే అతనికి బుద్ధి చెప్పేందుకు బంధువులు ఆస్పత్రికి వచ్చి డాక్టర్‌ను చితకబాదారు. చెంపదెబ్బలు కొడుతూ, గుద్దుతూ దాడి చేశారు. అయితే ఇదంతా అబద్ధమని.. తనపై అబద్ధపు కేసు పెట్టారని.. తనను దారుణంగా కొట్టారని.. కౌథా పోలీస్ స్టేషన్‌లో కౌంటర్ ఫిర్యాదు చేశారు. కాగా ఈ ఆరోపణలు, వైరల్ వీడియోతో.. నాందేడ్ మున్సిపల్ కార్పొరేషన్ డాక్టర్ కుంతూర్కర్‌ను వెంటనే సస్పెండ్ చేసింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న మహారాష్ట్ర ఆరోగ్య శాఖ.. పూర్తి దర్యాప్తుకు ఆదేశించింది.






