పెళ్లి అయిన 20 నిమిషాలకే తెగించిన భార్య.. దిక్కుతోచని స్థితిలో భర్త.. ఒత్తిడి భరించలేక..

by Sujitha Rachapalli |

పెళ్లి రోజు ప్రత్యేకంగా, ఆనందంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అలాగే ఈ యువకుడు కూడా ఆనందాన్నే కోరుకున్నాడు. పెళ్లి జరిగాక ఏం చేయాలో అన్ని ప్రణాళికలు వేసుకున్నాడు. భార్యతో హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయాలని కలలు కన్నాడు. అయితే భార్య

పెళ్లి అయిన 20 నిమిషాలకే తెగించిన భార్య.. దిక్కుతోచని స్థితిలో భర్త.. ఒత్తిడి భరించలేక..
X

దిశ, వెబ్ డెస్క్ : పెళ్లి రోజు ప్రత్యేకంగా, ఆనందంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అలాగే ఈ యువకుడు కూడా ఆనందాన్నే కోరుకున్నాడు. పెళ్లి జరిగాక ఏం చేయాలో అన్ని ప్రణాళికలు వేసుకున్నాడు. భార్యతో హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయాలని కలలు కన్నాడు. అయితే భార్య ఇచ్చిన స్ట్రోక్‌కు ఆ కల కలగానే మిగిలిపోయింది. పెళ్లి జరిగిన 20 నిమిషాలకే విడాకులు కోరింది. తను అత్తింట్లో ఉండనని తెగేసి చెప్పింది. ఎంత మంది ఎన్ని రకాలుగా ఒప్పించేందుకు ప్రయత్నించినా ససేమిరా అనేసింది. దిక్కుతోచని స్థితిలో పడిపోయిన భర్త ఈ ఒత్తిడి భరించలేక పెళ్లి రోజునే విడాకుల పేపర్లపై సంతకం చేయాల్సి వచ్చింది.

ఉత్తరప్రదేశ్ డియోరియాకు చెందిన విశాల్.. పూజను పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆమె పెళ్లి జరిగిన 20 నిమిషాలకే తాను ఇక్కడ ఉండనని పెళ్లి క్యాన్సల్ చేయాలని కోరింది. పెద్దలు ఎంత చెప్పినా వినలేదు. దాదాపు ఐదు గంటలపాటు బంధువులు, పెద్దలు, మధ్యవర్తులు ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ పూజ మాత్రం.. తనకు విడాకులు కావాలని.. ఇక్కడ ఉండలేనని చెప్పింది. దీంతో అర్ధరాత్రి వరకు చర్చలు జరగ్గా.. విశాల్ విడాకుల పేపర్లపై సంతకం చేశాడు.

Next Story