హైవే ఘోర ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొన్న కారు.. వ్యక్తి మృతి

by Bhanu |

నేషనల్ హైవే 44 పై శనివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. కడుకుంట్ల గ్రామం వద్ద డివైడర్‌ను ఢీకొన్న కారు బోల్తా

హైవే ఘోర ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొన్న కారు.. వ్యక్తి మృతి
X

దిశ, కొత్తకోట: నేషనల్ హైవే 44 పై శనివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. కడుకుంట్ల గ్రామం వద్ద డివైడర్‌ను ఢీకొన్న కారు బోల్తా పడడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే… కర్నూలు జిల్లా నందికొట్కూరు నుంచి ఓ మహిళతో పాటు ముగ్గురు వ్యక్తులు హైదరాబాద్‌ వైపు హాస్పటల్‌ వెళ్తుండగా, కడుకుంట్ల వద్ద వేగంగా వస్తున్న AP 21 CJ 2244 నంబర్ గల కారు నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది.


ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఓంకార్ నాగిరెడ్డి (36) అక్కడికక్కడే మృతిచెందగా, మిగతా ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు కొత్తకోట ఎస్సై ఆనంద్ తెలిపారు. ప్రమాదానికి అతివేగమే కారణంగా పోలీసులు భావిస్తున్నారు.

Next Story