- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘దిశ’ఎఫెక్ట్..’శవాల దగ్గర లంచాల లడాయి’ కథనానికి స్పందన
"శవాల దగ్గర లంచాల లడాయి "దిశ పేపర్ లో వచ్చిన కథనానికి గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్, ఏడీఎంఈ స్పందించారు.

దిశ, సిటీ క్రైమ్ : "శవాల దగ్గర లంచాల లడాయి "దిశ పేపర్ లో వచ్చిన కథనానికి గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్, ఏడిఎంఈ స్పందించారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 5వ తేదీన వచ్చిన కథనం, అందులో పేర్కొన్న అంశాల పై గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ విచారణకు ఆదేశించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. ఈ విచారణకు ప్రత్యేక కమిటీని నియమించినట్లు సూపరింటెండెంట్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ విచారణ కమిటీలో ప్రొఫెసర్ జనరల్ సర్జన్, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ కే.సునీల్ కుమార్, సివిల్ సర్జన్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ బి.శేషాద్రి, ప్రొఫెసర్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ జనరల్ మెడిసిన్ డాక్టర్ ఎల్. సునీల్ కుమార్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ పాథాలజీ డాక్టర్ చంద్రశేఖర్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ అనస్థీషియాలజీ డాక్టర్ ఏ.మురళీధర్, అసిస్టెంట్ డైరెక్టర్ అడ్మిషన్ ఫ్లోరెన్స్ మెర్లీన్ లు ఉన్నారు. ఈ కమిటీ విచారణ జరిపి త్వరలోనే సూపరింటెండెంట్, ఏడిఎమ్ఈ గాంధీ ఆసుపత్రికి రిపోర్టును అందచేస్తుందని వివరించారు.
పోలీసులు, పోస్ట్ మార్టం డాక్టర్ ల మధ్య సమాచారం లోపం ఉంది : గాంధీ ఆసుపత్రి , సూపరింటెండెంట్
దిశలో వచ్చిన శవాల వద్ద లంచాల లడాయి కథనం పై గాంధీ అడ్మినిస్ట్రేషన్ అధికారులు విచారణ జరిపాం. ఈ సందర్భంగా గాంధీ మార్చురీ వద్ద ఉన్న కొంత మందిని విచారించాం. మార్చురీ డాక్టర్లు, స్టాఫ్ ఎవరు కూడా పోస్టు మార్టం(పిఎంఈ) కోసం డబ్బులు అడగలేదని చెప్పారు. పీఎంఈ కి సంబంధించిన పలు పత్రాలకు సంబంధించిన విషయంలో పోలీసులకు మార్చురీ డాక్టర్ ల మధ్య కొంత సమాచార లోపం ఉందని గుర్తించాం. ఈ లోపాన్ని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ మొత్తం వ్యవహారం పై కమిటీని వేశాం. ఈ కమిటీ అన్ని విషయాలను పరిశీలించి మార్చురీ వద్ద నిబంధనల మేరకు డాక్టర్ లు, స్టాఫ్ ల సేవలు అందేలా చూస్తుందని సూపరింటెండెంట్ తన జారీ చేసిన నోటీసు లో తెలిపారు.






