ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయంలో అపశ్రుతి.. విద్యుత్ షాక్‌తో కాంట్రాక్ట్ ఉద్యోగి మృతి

by Kema Shiva Kumar |

కోనసీమ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం ద్రాక్షారామ భీమేశ్వరస్వామి ఆలయం (Draksharama Bheemeswara Swamy Temple)లో అపశ్రుతి చోటుచేసుకుంది.

ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయంలో అపశ్రుతి.. విద్యుత్ షాక్‌తో కాంట్రాక్ట్ ఉద్యోగి మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: కోనసీమ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం ద్రాక్షారామ భీమేశ్వరస్వామి ఆలయం (Draksharama Bheemeswara Swamy Temple)లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఇవాళ ఆలయ పరిధిలో కేంద్ర పురావస్తు శాఖ (Central Archaeological Survey of India) ఆధ్వర్యంలో గడ్డికోత పనులు చేపడుతున్నారు. అయితే, మిషన్‌తో గడ్డిని కోస్తుండగా కాంట్రాక్ట్ ఉద్యోగి భీమన్న (Bheemanna) విద్యుత్ షాక్‌తో దుర్మరణం పాలయ్యాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోని ప్రాణాలు కోల్పో్యాడు. ఈ మేరకు పోలీసులు భీమన్న మృతదేహాన్ని రాంచంద్రపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే, ప్రమాదం కారణంగా ద్రాక్షారామ మాణిక్యాంబ సమేత భీమేశ్వరాలయంలో దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆలయ సంప్రోక్షణ అనంతరం యథావిధిగా భక్తులను దర్శనాలకు అనుమతిస్తామని ఈవో వెంకట దుర్గాభవాని ప్రకటించారు.

Next Story