- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అదృశ్యమై.. చివరికీ శవమై..!
మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన ఓ యువకుడు శనివారం ఉదయం అనుమానస్పద స్థితిలో శవమై కనిపించాడు.

దిశ, ధర్పల్లి : మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన ఓ యువకుడు శనివారం ఉదయం అనుమానస్పద స్థితిలో శవమై కనిపించాడు. ధర్పల్లి మండలం రేకులపల్లి గ్రామానికి చెందిన కత్రాజి రాజశేఖర్ (30) ఈనెల31న ఇంటి నుంచి పనికి వెళ్తున్నానని వెళ్లిన యువకుడు మరుసటి రోజు వరకు రాకపోవడంతో ధర్పల్లి పోలీస్ స్టేషన్ లో కుటుంబ సభ్యుల పిర్యాదు చేశారు. పోలీసులు అదృశ్యం అయినట్టు కేసు నమోదు చేశారు. గ్రామ సమీపంలో ఎయిర్ టెల్ టవర్ కింద శవం పడి ఉండడంతో సమీపంలోని రైతులు పంట పొలాల వద్దకు వెళ్తుండగా.. దుర్గంధం వ్యాపించడంతో అటు వైపు వెళ్లి చూడగా శవం కనిపించినట్టు తెలిసి పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిసింది. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి శవాన్ని పరిశీలించగా రాజశేఖర్ గా పోలీసులు గుర్తించినట్టు సమాచారం. శవం కుళ్లిపోయినట్టు చూసి డాక్టర్లను పిలిపించి అక్కడే పోస్ట్ మార్టం నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. యువకుడిని హత్య చేసినట్లు గ్రామస్తులు గుసగుసలాడు తున్నారు. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు రెండు రోజులుగా కనిపించడం లేదనీ అతనే హత్య చేసి ఉంటాడని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. యువకుడి హత్య గ్రామంలో సంచలనం సృష్టించింది. ధర్పల్లి సీఐ బిక్షపతి ఎస్సై శ్రీనివాస్ సంఘటన స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






