- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యువకుడి అదృశ్యం
by Kema Shiva Kumar |
స్నేహితులను కలిసేందుకు వెళ్లిన యువకుడు అదృశ్యమైన ఘటన ఝరాసంగం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది.

X
దిశ, ఝరాసంగం : స్నేహితులను కలిసేందుకు వెళ్లిన యువకుడు అదృశ్యమైన ఘటన ఝరాసంగం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఝరాసంగం ఎస్సై రాజేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బర్దిపూర్ గ్రామానికి చెందిన ఎర్రోళ్ల ప్రవీణ్ కుమార్ (33) జహీరాబాద్ లోని ఓ మొబైల్ షాప్ లో పని చేస్తున్నాడు. గత నెల 30న ఉదయం 11 గంటలకు స్నేహితులను కలిసి వస్తానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. అతడికి ఫోన్ చేస్తే.. స్విచ్ ఆఫ్ వస్తుంది. దీంతో స్నేహితులను, బంధుమిత్రుల ఇళ్లలో వాకబు చేయగా ఎలాంటి సమాచారం లేకపోవడంతో యువకుడి తండ్రి నర్సింహులు ఝరాసంగం స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్సై రాజేందర్ రెడ్డి మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Next Story






