- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేప్ కేసులో నిందితుడికి రిమాండ్
by Bhanu |
ధర్మపురి మండలంలో గత వారం రోజుల క్రితం జరిగిన అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత యువతి ఫిర్యాదుతో

X
దిశ, వెల్గటూర్: ధర్మపురి మండలంలో గత వారం రోజుల క్రితం జరిగిన అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత యువతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని మంగళవారం రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం, ధర్మపురి మండలానికి చెందిన 19 ఏళ్ల యువతిపై జూన్ 28న నిందితుడు వెలుగు గంగాధర్ అనే వ్యక్తి అత్యాచారం చేశాడు.
అయితే ఈ విషయం గురించి బాధితురాలు ఆలస్యంగా ధైర్యం చేసి ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారు. ధర్మపురి ఎస్సై ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో కేసు నమోదు కాగా, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రామ్ నర్సింహా రెడ్డి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం రిమాండ్‌కు తరలించారు. బాధితురాలికి సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు.
Next Story






