- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సురేష్ అనే పేరుతో ఎవరూ లేరు: ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన
సురేష్ అనే పేరుతో ఎవరూ లేరు: ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన

దిశ, వెబ్‌డెస్క్: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పీఏ సురేష్(Suresh) భూకబ్జాలను ప్రోత్స హిస్తున్నాడని భీమరశెట్టి రమణబాబు అనే వ్యక్తి ఆరోపించారు. విశాఖలోని వీజేఎఫ్ ప్రెస్ క్లబ్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అచ్యుతాపురం మండలం దుప్పుతూరులో 11.23 సెంట్ల భూమి భూకబ్జా చేయాలని చూస్తున్నారని, ఈ విషయమై అచ్యుతాపురం సీఐకి, తహసీల్డార్‌కు ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పారు. తాజాగా ఈ వార్తలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కార్యాలయం(Deputy Chief Minister's Office) స్పందించింది. ఈ మేరకు శనివారం ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టింది. ‘‘సురేష్ అనే పేరుతో ఎవరూ ఉప ముఖ్యమంత్రి పేషీలో లేరు. సివిల్ వివాదానికి ఉప ముఖ్యమంత్రి పేషీకి లింక్ పెట్టడం దుష్ప్రచారమే. ఈ విషయాన్ని ఖండిస్తున్నాము. వివిధ సమస్యలతో అర్జీలు.. ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి నేరుగానూ, జనవాణి కార్యక్రమం ద్వారానూ వస్తాయి. వాటిని సంబంధిత శాఖలకు, జిల్లా అధికారులకు పంపించి నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించాలి అని సూచించడం జరుగుతుంది’’ అని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ ఇచ్చింది. ట్వీట్






