- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డెంటిస్ట్ ప్రత్యూష ఆత్మహత్య కేసు.. భర్త డాక్టర్ సృజన్‌కు ఊహించని షాక్
హనుమకొండలో డెంటిస్ట్ డాక్టర్ ప్రత్యూష (Pratyusha) ఆత్మహత్య కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: హనుమకొండలో డెంటిస్ట్ డాక్టర్ ప్రత్యూష (Pratyusha) ఆత్మహత్య కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న మృతురాలి భర్త డాక్టర్ సృజన్ (Srujan)కు తాజాగా మరో బిగ్ షాక్ తగిలింది. ప్రస్తుతం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న అతడిపై మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ సస్పెన్షన్ వేటు వేస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, జూన్ 15న డెంటిస్ట్ డాక్టర్ ప్రత్యూష భర్త సృజన్ వేధింపులు తట్టుకోలేక ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు మృతురాలి తల్లిదండ్రలు తమ బిడ్డకు చావుకు కారణం భర్తేనని, విడాకులు ఇవ్వాలని వేధించారని హనుమకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భర్త సృజన్, అత్తమామలు పుణ్యవతి, మధుసూదన్, ఇన్‌స్టా ఇన్‌ఫ్లూయెన్సర్ శృతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై BNS యాక్ట్ 108, 115(2), 292, 351(2), 85 r/w 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.






