వ్య‌వ‌సాయ బావిలో ప‌డి మ‌తిస్థిమితం లేని వృద్ధురాలు మృతి

by Nallavelli.Anjaneyulu |

మ‌తిస్థిమితం స‌రిగ్గా లేని వృద్ధురాలు వ్య‌వ‌సాయ బావిలో ప‌డి మృతి చెందిన ఘ‌ట‌న క‌రీంన‌గ‌ర్ జిల్లా సైదాపూర్ మండ‌లంలోని ఎలాబోతారం గ్రామంలో చోటు చేసుకుంది.

వ్య‌వ‌సాయ బావిలో ప‌డి మ‌తిస్థిమితం లేని వృద్ధురాలు మృతి
X

దిశ‌, హుజూరాబాద్ : మ‌తిస్థిమితం స‌రిగ్గా లేని వృద్ధురాలు వ్య‌వ‌సాయ బావిలో ప‌డి మృతి చెందిన ఘ‌ట‌న క‌రీంన‌గ‌ర్ జిల్లా సైదాపూర్ మండ‌లంలోని ఎలాబోతారం గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ స‌భ్యులు, పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఎలాబోతారం గ్రామానికి చెందిన నూనె వెంక‌ట‌మ్మ(80) గ‌త కొద్ది రోజులుగా మ‌తి స్థిమితం స‌రిగ్గా లేదు. క‌ర్ర స‌హాయంతో చేతుల‌తో పాకుతూ గ్రామంలో తిరుగుతుండేది. ఆదివారం రాత్రి గ్రామంలో తిరుగుతూ క‌నిపించింది. సోమ‌వారం వెత‌క‌గా గ్రామ శివారులోని వ్య‌వ‌సాయ బావిలో నూనె వెంక‌ట‌మ్మ మృత‌దేహం క‌నిపించింది. స్థానికులు కుటుంబ స‌భ్యుల‌కు స‌మాచారం ఇచ్చారు. వ్య‌వ‌సాయ బావిలోంచి మృత‌దేహాన్ని బ‌య‌టికి తీశారు. మృతురాలు కుమారుడు నూనె ర‌వీంద‌ర్ మ‌తి స్థిమితం స‌రిగ్గా లేకను బావిలో ప‌డి మృతి చెందిన‌ట్టు పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. సైదాపూర్ ఎస్సై కొప్పుల స్వాతి కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story