- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమ్మా నాన్న.. నన్ను క్షమించండి.. డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య లేఖ
భవిష్యత్తులో ఏం చేయాలో తెలియడం లేదని ఆత్మహత్య చేసుకుంది డిగ్రీ విద్యార్థిని. ఢిల్లీ యూనివర్సిటీకి సంబంధించిన ఆత్మారామ్ కాలేజ్‌లో ఫైనల్ ఇయర్ చదువుతున్న బీఎస్సీ స్టూడెంట్ నిఖిత.. రెవరీ సిటీలోని ఓ హోటల్ రూమ్‌లో ఉరేసుకుని చనిపోయింది. సోమవారం రోజు

దిశ, వెబ్ డెస్క్ : భవిష్యత్తులో ఏం చేయాలో తెలియడం లేదని ఆత్మహత్య చేసుకుంది డిగ్రీ విద్యార్థిని. ఢిల్లీ యూనివర్సిటీకి సంబంధించిన ఆత్మారామ్ కాలేజ్‌లో ఫైనల్ ఇయర్ చదువుతున్న బీఎస్సీ స్టూడెంట్ నిఖిత.. రెవరీ సిటీలోని ఓ హోటల్ రూమ్‌లో ఉరేసుకుని చనిపోయింది. సోమవారం రోజు మధ్యాహ్నం మూడు గంటలకు హోటల్ చెక్ ఇన్ చేసిన ఆమె.. పదకొండు గంటల వరకు ఎలాంటి సౌండ్ లేకుండా ఉండటంతో.. స్టాఫ్‌కు అనుమానం వచ్చి పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. పోలీసులు డోర్ ఓపెన్ చేసి చూడగా.. సీలింగ్‌కు ఉరేసుకుని నిర్జీవంగా కనిపించింది. బాడీని పోస్టుమార్టం నిమిత్తం పంపించిన పోలీసులు.. సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు.
‘అమ్మా నాన్న నన్ను క్షమించండి. నేను ఫ్యూచర్ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నా. నేను తర్వాత ఏం చేయాలి? జాబ్ వస్తదా రాదా? నా మెంటల్ స్టేట్ సరిగ్గా లేదు. నేను చాలా రోజులుగా ఈ విషయం గురించి ఆలోచిస్తున్నా. రెవరీలోని ఈ హోటల్‌ను ఎంచుకున్నా’ అని ఆత్మహత్య లేఖలో పేర్కొంది. కాగా పోలీసులు అమ్మాయి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.






