- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆంటీల మోజు...భార్యను చంపి, మంచం కింద దాచిన భర్త...!
దేశ రాజధాని ఢిల్లీలో ( Delhi ) దారుణం జరిగింది. తన భార్యను ( Wife) చంపి... మంచం కింద ఉన్న బాక్స్ లో దాచి పెట్టాడు ఓ భర్త

దిశ, వెబ్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో ( Delhi ) దారుణం జరిగింది. తన భార్యను ( Wife) చంపి... మంచం కింద ఉన్న బాక్స్ లో దాచి పెట్టాడు ఓ భర్త ( Husband). తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని... తన ఇద్దరు స్నేహితులతో కలిసి, భార్యను హత్య చేశాడు ఓ భర్త. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. వివేకానంద మిశ్రా ( Vivekanand Mishra), 35 ఏళ్ల అంజలి ( Anjali) ఇద్దరు భార్యాభర్తలు. వీరిద్దరూ ఢిల్లీలోని తమ సొంత అపార్ట్మెంట్లోనే నివాసం ఉంటున్నారు.
అంజలి సొంతూరు పంజాబ్ లోని ( Punjab ) ఓ మారుమూల గ్రామం. అయితే అంజలి పచ్చని కాపురం లో.. అక్రమ సంబంధం చిచ్చు పెట్టినట్లు తెలుస్తోంది. వేరే అమ్మాయితో వివేకానంద మిశ్రా.. అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అట. ఈ విషయంలోనే తరచూ అంజలి అలాగే వివేకానంద మిశ్రా మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తన పుట్టింటికి అంజలి వెళ్ళింది. ఈ విషయం తన తల్లిదండ్రులతో ఈ విషయం చెప్పిందట అంజలి. ఆ తర్వాత.. మళ్లీ అంజలిని ఢిల్లీకి తీసుకువెళ్లాడు వివేకానంద మిశ్రా.
ఈ తరుణంలోనే మార్చి 21వ తేదీన తన భార్యను ఇద్దరు స్నేహితులతో కలిసి చంపేశాడు మిశ్రా. అనంతరం బెడ్ మంచం కింద ఉన్న బాక్సులో... అంజలి శవాన్ని దాచి పెట్టారు. ఆ తర్వాత ఢిల్లీ వదిలి పారిపోయారని చెబుతున్నారు. మార్చి 28వ తేదీన.. ఇంట్లో నుంచి కూలిన వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ( Police) సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు... అంజలి బాడీని గుర్తించారు. ఆ తర్వాత.. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని.. పరారీలో ఉన్న అంజలి భర్తను అరెస్టు చేశారు. మిశ్రాకు సహాయం చేసిన ఇద్దరు స్నేహితులను కూడా అరెస్టు చేశారు పోలీసులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.






