ఢిల్లీలో దారుణం.. తిట్టిందని యజమాని, ఆమె 4ఏళ్ల కుమారుడిని హత్య చేసిన డ్రైవర్

by Ajay Maddhiboyina |

ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. మంద‌లించింద‌ని య‌జ‌మానితో పాటు ఆమెతో పాటు ఆమె 4ఏళ్ల కుమారుడిని సైతం దారుణంగా హ‌త్య

ఢిల్లీలో దారుణం.. తిట్టిందని యజమాని, ఆమె 4ఏళ్ల కుమారుడిని హత్య చేసిన డ్రైవర్
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. మంద‌లించింద‌ని య‌జ‌మానితో పాటు ఆమెతో పాటు ఆమె 4ఏళ్ల కుమారుడిని సైతం దారుణంగా హ‌త్య చేశాడు. త‌ర‌వాత అక్క‌డ నుండి పారిపోయాడు. అనుమానాస్ప‌ద మృతిగా కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేసిన పోలీసులు డైవ‌రే హ‌త్య చేసిన‌ట్టు గుర్తించారు. వివ‌రాల్లోకి వెళితే.. ఢిల్లీలోని ల‌జ్ ప‌త్ న‌గ‌ర్‌లో బుధవారం రాత్రి 42 ఏళ్ల రుచిత సెవానీ, ఆమె కుమారుడు క్రిష్ ఇంట్లో హత్యకు గురయ్యారు. రుచిత భర్త కుల్దీప్ ఇంటికి వచ్చిన తరవాత రక్తం మరకలు చూసి ఆందోళన చెందాడు.

ఫోన్ చేసినా భార్య లిఫ్ట్ చేయకపోవడం, ఇంటికి తాళం వేసి ఉండటంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి విచారణ మొదలు పెట్టారు. పోలీసుల విచారణలో వాళ్ల ఇంట్లో డ్రైవర్ గా పనిచేస్తున్న ముఖేష్ 24 ఇద్దరినీ హత్య చేసినట్టు తేలింది. దీంతో నింధితుడి కోసం గాలించి యూపీకి వెళుతున్న ఓ ట్రైన్‌లో పట్టుకున్నారు. నింధితుడు బీహార్‌కు చెందిన వాడు కాగా రుచిత భర్త కుల్దీప్ వద్ద డ్రైవర్‌గా, వారి బట్టల దుకాణంలో పనిచేస్తున్నాడు. పోలీసుల విచారణలో తనను రుచిత తిట్టిందని అందుకే చంపానని చెప్పాడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. నింధితుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

Next Story