- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీలో కలకలం.. ఒకే ఇంట్లో ఇద్దరు వృద్ధుల మృతదేహాలు లభ్యం
సెంట్రల్ ఢిల్లీలోని న్యూ రాజేంద్ర నగర్‌లో ఇద్దరు వృద్ధురాళ్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పోలీసులు, ఫోరెన్సిక్ బృందం దర్యాప్తు చేస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో ఇద్దరు వృద్ధుల మృతదేహాలు కలకలంగా మారాయి. ఒకే ఇంట్లో ఇద్దరి మృతదేహాలు లభ్యం కావడంతో స్థానికులు షాక్ కు గురయ్యారు. ఈ షాకింగ్ సంఘటన సెంట్రల్ ఢిల్లీ పరిధిలోని న్యూ రాజేంద్ర నగర్, ఆర్ బ్లాక్‌లో ఉన్న ఒక నివాసంలో వెలుగుచూసింది. మరణించిన వృద్ధురాళ్లను సరోజ్, చంద్రకాంతలుగా ఢిల్లీ పోలీసులు గుర్తించారు. ఒకే ఇంట్లో ఇద్దరి మృతదేహాలు పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ పోలీసులు తమ ఫోరెన్సిక్ బృందంతో (Forensic Team) కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలంలో కీలక ఆధారాలను సేకరిస్తున్నారు. వీరిద్దరూ ఏ పరిస్థితుల్లో మరణించారు? ఇది హత్యా లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నట్లు తెలుస్తోంది.






