- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షాపింగ్, ఖర్చుల కోసం డిగ్రీ విద్యార్థిని వ్యభిచారం.. సంచలన నిజాలు బయటపెట్టిన డిటెక్టివ్
షాపింగ్, స్నేహితులతో జల్సాలు చేసేందుకు ఓ యూనివర్సిటీ విద్యార్థిని ఏకంగా వ్యభిచారం చేయడం ప్రారంభించింది. ఈ ఘటన దేశరాజధానిలో చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: షాపింగ్, స్నేహితులతో జల్సాలు చేసేందుకు ఓ యూనివర్సిటీ విద్యార్థిని ఏకంగా వ్యభిచారం చేయడం ప్రారంభించింది. ఈ ఘటన దేశరాజధానిలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలను ప్రముఖ డిటెక్టివ్ తాన్యపూరి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఢిల్లీకి చెందిన ఓ జంట తమ కూతురు ఇంటికి ఆలస్యంగా రావడం, ఆమె ప్రవర్తనలో మార్పు ఉండటంతో తమ కంపెనీని సంప్రదించారని చెప్పింది. తమ కూతురు ఎవరితో అయినా తిరుగుతుందేమో అనే అనుమానం ఉందని చెప్పారని తెలిపింది.
దీంతో కొద్దిరోజుల పాటు ఆ అమ్మాయిపై నిఘా పెట్టామని తెలిపింది. అయితే ఆమె ఎవరితోనూ తిరిగినట్టు కనిపించలేదని చెప్పింది. కానీ ఒకరోజు ఆ అమ్మాయి ఢిల్లీలోని వ్యభిచార గృహాలు, వేశ్యలు ఉండే ప్రదేశానికి వెళ్లినట్టు చూశామని తెలిపింది. తరవాత మరో రెండు మూడు సార్లు చూసి ఎంక్వైరీ చేయగా షాకింగ్ నిజాలు బయటపడ్డాయని చెప్పింది. ఆ విద్యార్థిని షాపింగ్స్ కోసం స్నేహితులతో జల్సాలు చేయడం కోసం వ్యభిచారం చేస్తుందని తేలినట్టు చెప్పింది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చివరికి డబ్బుల కోసం ఇలాంటి పనులు కూడా చేస్తారా అని ఆశ్చర్యపోతున్నారు.






