- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లో జింక మాంసం అమ్మడం కలకలం సృష్టించింది. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పరిధిలోని సులేమాన్‌నగర్‌లో ఓ ఇంటిలో జింక మాంసం అమ్ముతుండటం సంచలనం రేపింది. అక్కడ జింక మాంసం అమ్ముతున్న ఓ వ్యక్తిని ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అత్తాపూర్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇది వరకు కూడా వన్య ప్రాణుల మాంసం అమ్మారా? ఎక్కడి నుంచి తీసుకు వచ్చారు? దీని వెనుక ఏదైనా ముఠా ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.
Next Story






