- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉదాసీన్ మఠ్ ఖాళీ స్థలంలో కుళ్లిన స్థితిలో వ్యక్తి మృతదేహం లభ్యం
కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉదాసీన్ మఠ్‌కు సంబంధించిన ఖాళీ మైదానంలో ఆదివారం కుళ్లిన స్థితిలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైందని పోలీసులు తెలిపారు.

దిశ, కూకట్పల్లి : కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉదాసీన్ మఠ్‌కు సంబంధించిన ఖాళీ మైదానంలో ఆదివారం కుళ్లిన స్థితిలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైందని పోలీసులు తెలిపారు. ఉదాసీన్ మఠ్‌కు చెందిన సెక్యూరిటి ఇన్చార్జి సూరజ్ మిశ్ర ఆదివారం కూకట్పల్లి పోలీసులకు సమాచారం అందించాడు. ఖాళీ మైదానంలో ఓ వ్యక్తి మృతదేహం ఉన్నట్టు తెలిపాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఓ చెట్టు కొమ్మకు నల్లని బెల్టుకు కుళ్లిన స్థితిలో మృతదేహం భాగం వేలాడు కనిపించింది. పక్కనే ఉన్న ప్యాంట్ జేబులో ఉన్న మొబైల్ ఫోన్ ద్వార సదరు వ్యక్తి పేరు వల్లూరి బాలకిషన్‌గా గుర్తించారు. బాలకిషన్ మియాపూర్ పోలీస్ స్టేషన్ ఫరిధిలోని గోకుల్ ప్లాట్స్‌లో నివాసం ఉంటు మెడిప్లస్‌లో ఉద్యోగం చేస్తుండే వాడు. మార్చి నెలలో బాలకిషన్ భార్య మృతి చెందడంతో బాలకిషన్‌పై వేధింపుల కేసు నమోదు కాగా విచారణ జరుగుతుంది. ఈ క్రమంలో మనస్థాపానికి గురైన బాలకిషన్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.






