గోవా రెస్టారెంట్ అగ్ని ప్రమాదంలో పెరిగిన మృతుల సంఖ్య

by Malleboina Mahesh |

దేశం మొత్తం ఉలిక్కిపడేలా.. గోవాలోని ఓ రెస్టారెంట్ లో జరిగిన అగ్ని ప్రమాద మృతుల సంఖ్య పెరుగుతోంది.

గోవా రెస్టారెంట్ అగ్ని ప్రమాదంలో పెరిగిన మృతుల సంఖ్య
X

దిశ, వెబ్ డెస్క్: దేశం మొత్తం ఉలిక్కిపడేలా.. గోవాలోని ఓ రెస్టారెంట్ లో జరిగిన అగ్ని ప్రమాద (Fire hazard) మృతుల సంఖ్య పెరుగుతోంది. శనివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు పర్యాటకులు సహా స్టాఫ్ సిబ్బంది 23 మంది సజీవ దహనం అయ్యారు. అయితే మంటలను అదుపు చేసిన తర్వాత రెస్టారెంట్ లో మరో ఇద్దరు మృతదేహాలను అధికారులు గుర్తించారు. దీంతో ఈ ఘోర అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 25కు చేరింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. డాన్స్ బోర్డులో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిపారు. ముక్యంగా ప్రమాదం సమయంలో గ్రౌండ్ ఫ్లోర్ లో పని చేస్తున్న తన ఫ్రెండ్స్ మొత్తం చనిపోయారని అతను చెప్పుకొచ్చాడు.

కాగా ప్రమాదంపై స్పందించిన సీఎం ప్రమోద్ సావంత్ (CM Pramod Sawant).. సంఘటన స్థలాన్ని సందర్శించి, మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే ఈ ప్రమాదంలో దాదాపు 50 మంది వరకు గాయపడ్డారు. వారిలో ఐదుగురికి తీవ్ర గాయాలు కావడంతో గోవా మెడికల్ కాలేజీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారికి అసవరమైన మెరుగైన చికిత్స అందించాలని సీఎం అధికారులకు ఆదేశించారు. అలాగే ఈ ప్రమాదం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి పూర్తి వివరాలు అందించాలని సీఎం పోలీసులకు సూచించారు. దీంతో అగ్ని ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రెస్టారెంట్ ఓనర్, మెనేజర్ లను పలు సెక్షన్ల కింద నిందితులుగా చేర్చి, పూర్తి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Next Story