పాకాల అడవిలో మృతదేహాల కలకలం.. వారంతా ఎవరు? ఎందుకు చంపారు?

by Naga Rani Yarlagadda |

తిరుపతి జిల్లా పాకాల మండల పరిధిలో ఉన్న అటవీప్రాంతంలో (Pakala Forest Area) బయటపడిన మృతదేహాలపై మిస్టరీ ఇంకా వీడలేదు.

పాకాల అడవిలో మృతదేహాల కలకలం.. వారంతా ఎవరు? ఎందుకు చంపారు?
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి జిల్లా పాకాల మండల పరిధిలో ఉన్న అటవీప్రాంతంలో (Pakala Forest Area) బయటపడిన మృతదేహాలపై మిస్టరీ ఇంకా వీడలేదు. అటవీప్రాంతంలో డెడ్ బాడీలు దొరకడంతో వారిని ఆస్తి కోసం చంపేశారా లేక పరువు హత్యలా ? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు విషయమై పాకాల పోలీసులు తంజావూరు పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికి ఒక మహిళ, పురుషుడి డెడ్ బాడలకు పోస్టుమార్టం చేయగా.. వారి నోటిలో గుడ్డలు, గ్లౌజులు కుక్కి, ప్లాస్టర్ వేసి చంపినట్లుగా తెలిసిందని పోలీసులు తెలిపారు. వారిలో మృతుడు తంజావూర్ కు చెందిన కలై సెల్వన్ గా , మృతురాలు అతని వదినగా గుర్తించారు. ఇద్దరు పిల్లలు.. ఆమె పిల్లలేనని భావిస్తున్నారు. నేడు పిల్లల మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం చేయనున్నారు.

సెప్టెంబర్ 14న పాకాల మండలం గాదంకి టోల్ ప్లాజా సమీపంలో అడిలో రెండు డెడ్ బాడీలు దొరికాయి. పనపాకం రక్షిత అడవిలో బాగా కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహాలను గుర్తించిన పశువుల కాపర్లు.. పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. చెట్టుకు వేలాడుతున్న వ్యక్తి మృతదేహాన్ని కిందికి దింపించారు. ఆ పక్కనే ఒక వస్త్రం కప్పి మహిళశవం కనిపించింది. ఆమె పక్కనే మరో రెండు గోతుల్లో శవాలను పూడ్చిన ఆనవాళ్లు కనిపించాయి. ఈ మృతదేహాలు కనిపించిన తీరును చూసి ప్రాథమికంగా హత్యలుగా నిర్థారించగా.. పోస్టుమార్టంలోనూ అదే రుజువైంది. అయితే.. పరువు హత్యలా ? అన్న అనుమానమే ఎక్కువగా వ్యక్తమవుతోంది. వదిన, మరిది కావడంతో వివాహేతర సంబంధం నేపథ్యంలో చంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

Next Story