మద్యం మత్తులో డీసీఎం డ్రైవర్ రహదారిపై ఇష్టారాజ్యం..

by Bhanu |

వరంగల్ జిల్లాలోని రాయపర్తి మండలంలో మద్యం మత్తులో డీసీఎం వాహనం నడుపుతున్న ఓ డ్రైవర్ బుధవారం పోలీసులకు

మద్యం మత్తులో డీసీఎం డ్రైవర్ రహదారిపై ఇష్టారాజ్యం..
X

దిశ, రాయపర్తి: వరంగల్ జిల్లాలోని రాయపర్తి మండలంలో మద్యం మత్తులో డీసీఎం వాహనం నడుపుతున్న ఓ డ్రైవర్ బుధవారం పోలీసులకు పట్టిన ఘటన కలకలం రేపింది. వరంగల్-ఖమ్మం జాతీయ రహదారి (563)పై డీసీఎం వేగంగా , అసహజంగా నడుస్తుండటాన్ని గమనించిన పోలీసులు వెంటనే ఆపి తనిఖీ చేశారు.

ఆ వాహనం ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురం వద్ద తిరువూరు నుంచి మధ్యప్రదేశ్‌కు కొబ్బరికాయలు లోడ్‌తో వెళుతోంది. డ్రైవర్‌ తూలుతూ ఉండటాన్ని గమనించిన పోలీసులు అతను మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్టు నిర్ధారించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రాయపర్తి ఎస్‌ఐ ముత్యం రాజేందర్ తెలిపారు.

Next Story