రీల్స్ మోజులో కూతురు దారుణం.. కన్న తండ్రిని ఏం చేసిందో తెలుసా?

by Gantepaka Srikanth |

ప్రపంచ వ్యాప్తంగా ఇన్స్‌స్టాగ్రామ్ రీల్స్(Instagram Reels) పిచ్చి వ్యసనంగా మారుతోంది.

రీల్స్ మోజులో కూతురు దారుణం.. కన్న తండ్రిని ఏం చేసిందో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా ఇన్స్‌స్టాగ్రామ్ రీల్స్(Instagram Reels) పిచ్చి వ్యసనంగా మారుతోంది. ఇటీవల కాలంలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ సోషల్ మీడియా(Social Media)లో ఫేమస్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు ఎక్కడ పడితే అక్కడ.. ఎలా పడితే అలా రీల్స్ చేస్తూ దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఈ రీల్స్ పిచ్చి ఓ వ్యక్తి చావుకు కారణమైంది. వివరాల్లోకి వెళితే.. హరియాణాలోని గురుగ్రామ్‌(Gurugram)లో దారుణం చోటుచేసుకుంది. రీల్స్ చేయొద్దని కూతురు రాధిక యాదవ్‌కు తండ్రి చెప్పారు. అయినా.. పదే పదే రీల్స్ చేయడం, తండ్రి మాటకు అడ్డుచెప్పడం మొదలెట్టింది. దీంతో ఇటీవల ఆ తండ్రి కాస్త గట్టిగా మందలించాడు. కోపం ఆపుకోలేక.. స్వయంగా కన్న తండ్రినే కాల్చి చంపేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని రాధికను అదుపులోకి తీసుకున్నారు. రీల్స్ మోజులో పబ్లిక్‌ను ఇబ్బంది పెట్టినా.. ఇతరులను కించపరిచేలా రీల్స్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని స్థానిక పోలీసులు హెచ్చరికలు చేశారు.

Next Story