Zomato: జొమాటో ముసుగులో దర్జాగా గంజాయి సప్లై

by Disha Web Desk 4 |
Zomato: జొమాటో ముసుగులో దర్జాగా గంజాయి సప్లై
X

దిశ, వెబ్ డెస్క్: జోమాటో డెలివరీ పేరిట గంజాయి సరఫరా చేస్తున్న ఫుడ్ డెలివరీ బాయ్ ని తుకారాం గేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర మండలం డీసీసీ చందనాదీప్తీ తెలిపిన వివరాల ప్రకారం నేరెడ్ మెట్ మధురనగర్ కు చెందిన నితీష్ చంద్ర(20) జోమాటోలో ఫుడ్ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. అతనికి గంజాయి తీసుకునే అలవాటుంది. జవహర్ నగర్ కు చెందిన డ్రగ్స్ వ్యాపారి రాహుల్ తో పరిచయం ఏర్పడింది. వీరు కోడ్ భాష వినియోగిస్తూ గంజాయిని సరఫరా చేస్తు్న్నారు.

ఎవరికి అనుమానం రాకుండా చిరుత, కలాకన్, స్వీట్ బాక్స్ వంటి కోడ్ పదాలను గంజాయి సరఫరా సమయంలో వినియోగిస్తున్నారు. ఈనెల 11న రాహుల్ నుంచి మూడు గంజాయి ప్యాకెట్లు తీసుకున్న నితీష్ తుకారాం గేట్ లో ఇచ్చేందుకు రాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద 600 గ్రాముల ఎండు గంజాయిని గుర్తించారు. రాహుల్ ఇప్పటికే భువనగిరి పోలీసులకు పాత కేసులో లొంగిపోయినట్లు గుర్తించారు. వీరి ద్వారా గంజాయి తీసుకున్న 30 మందిని గుర్తించినట్లు డీసీపీ తెలిపారు.

Also Read...

రైల్వే ట్రాక్‌పై రీల్ చేస్తుండగా రైలు ఢీకొని ముగ్గురు మృతి..


Next Story

Most Viewed