- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాఫ్ట్ వేర్ ఉద్యోగిని నిండా ముంచిన సైబర్ నేరగాళ్లు
సాఫ్ట్ వేర్ ఉద్యోగిని నిండా ముంచిన సైబర్ నేరగాళ్లు

దిశ, వెబ్‌డెస్క్: సైబర్ నేరగాళ్ల(Cyber Criminals) ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. యువకుల మొదలు వృద్ధుల వరకు ఎవరినీ వదలడం లేదు. బ్యాంకులో బ్యాలెన్స్ ఉందని తెలిస్తే చాలు.. మొత్తం కాజేస్తున్నారు. తాజాగా పెట్టుబడి పేరుతో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని మోసం చేశారు. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి నుంచి రూ.3.49 కోట్లు కాజేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు తరలించి విచారిస్తున్నారు. 2 నెలల క్రితం బాధితుడికి ఆరోహి పేరుతో వాట్సాప్ సందేశం పంపించి మోసానికి తెగబడ్డట్లు పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు.. సైబర్ నేరాల పై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు చేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం పేరిగే కొద్ది సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, సైబర్ నేరాల పై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.






