- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశంలోనే అతిపెద్ద సినిమా పైరసీ ముఠా అరెస్ట్
తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం రేపిన అతిపెద్ద మూవీ పైరసీ ముఠాను అరెస్ట్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు (Cybercrime police) ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం రేపిన అతిపెద్ద మూవీ పైరసీ ముఠా (Piracy gang)ను అరెస్ట్ చేశారు. ఈ రోజు ఉదయం.. దేశంలోనే అతిపెద్ద మూవీ పైరసీ ముఠా (Movie piracy gang)ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. తెలుగు తో సహా పలు భాషలు సినిమాలు పైరసీ చేస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వల్ల ఇప్పటికే అన్ని భాషల సినిమా ఇండస్ట్రీకి దాదాపు రూ.22 వేల కోట్ల నష్టం కలిగించినట్టు అంచనా వేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. సినిమా పైరసీ గ్యాంగ్ గత 18 నెలల్లో 40కి పైగా తెలుగు, హిందీ, తమిళ సినిమాలను విడుదల రోజునే రికార్డు చేసి ఆన్‌లైన్‌లో లీక్ చేసినట్లు విచారణలో బయటపడింది.
ఈ ముఠా పలు అంతర్జాతీయ పైరసీ వెబ్‌సైట్ల (1TamilMV, 5MoviezRulz వంటివి) ద్వారా సినిమాలను విక్రయిస్తూ, క్రిప్టోకరెన్సీ రూపంలో చెల్లింపులు స్వీకరిస్తూ పరిశ్రమకు భారీగా నష్టం కలిగించింది. టాలీవుడ్ లోనే ఈ పైరసీ కారణంగా సుమారు ₹3,700 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని అంచనా. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి డిజిటల్ పరికరాలు, ల్యాప్‌టాప్‌లు, హార్డ్‌డిస్క్‌లు, క్రిప్టో ట్రాన్సాక్షన్ వివరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ చర్యతో సినిమా పరిశ్రమకు ఊరట లభించగా, భవిష్యత్తులో ఇలాంటి నెట్‌వర్క్ (network)లపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైమ్ అధికారులు (Cybercrime officers) స్పష్టం చేశారు. కాగా జులై 3న వనస్థలిపురానికి చెందిన కిరణ్ అనే వ్యక్తిని సినిమా పైరసీ కేసులో పోలీసులు అరెస్టు చేసి.. విచారించగా ఈ నెట్ వర్క్ మొత్తం బయటపడినట్లు తెలుస్తోంది. అలాగే ఈ ముఠాకు సంబంధించిన నెట్ వర్క్ దుబాయ్, నెదర్లాండ్, మయన్మార్ వరకు విస్తరించి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది.






