- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.. ఏకంగా పోలీస్ కమిషనర్‌నే
సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. కేవలం అమాయప్రజలనే కాకుండా ఏకంగా పోలీసులను సైతం టార్గెట్ చేస్తున్నారు. పోలీసులు అడిగితే భయానికో భక్తికో డబ్బులు ఇస్తారనో ఏమో కానీ వారి పేరుతో ఫేస్ బుక్ ఖాతాలు తెరిచి డబ్బులు కావాలని సందేశాలు పంపుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. కేవలం అమాయప్రజలనే కాకుండా ఏకంగా పోలీసులను సైతం టార్గెట్ చేస్తున్నారు. పోలీసులు అడిగితే భయానికో భక్తికో డబ్బులు ఇస్తారనో ఏమో కానీ వారి పేరుతో ఫేస్ బుక్ ఖాతాలు తెరిచి డబ్బులు కావాలని సందేశాలు పంపుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే సిద్దిపేటలో చోటు చేసుకుంది.
సిద్దిపేట సీపీ విజయ్ కుమార్ ఫోటో, పేరుతో అకౌంట్ క్రియేట్ చేసి సైబర్ నేరగాళ్లు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతున్నారు. ఎవరైనా యాక్సెప్ట్ చేస్తే వెంటనే మెసెంజర్ లో వారి కాంటాక్ట్ నంబర్ అడిగి డబ్బులు కావాలని కోరుతూ సందేశాలు పంపుతున్నారు. విషయం సీపీ దృష్టికి వెళ్లడంతో ఆయన అప్రమత్తం అయ్యారు. అలాంటి రిక్వెస్ట్ లకు సందేశాలకు ఎవరూ స్పందించవద్దని సూచించారు. నకిలీ ఫేస్ బుక్ అకౌంట్లపై సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు వెల్లడించారు.






