క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామంటూ ఫోన్.. కట్ చేస్తే అకౌంట్‌లో రూ.2 లక్షలు మాయం

by Ajay Maddhiboyina |

క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామంటూ ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు ఓ వృద్ధుడి ఖాతాలో నుండి రూ.2 ల‌క్ష‌లు కాజేశారు. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్‌లో చోటు చేసుకుంది.

క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామంటూ ఫోన్.. కట్ చేస్తే అకౌంట్‌లో రూ.2 లక్షలు మాయం
X

దిశ‌, వెబ్ డెస్క్: క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామంటూ ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు ఓ వృద్ధుడి ఖాతాలో నుండి రూ.2 ల‌క్ష‌లు కాజేశారు. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్‌లో చోటు చేసుకుంది.షేక్ పేటకు చెందిన 67 ఏళ్ల వ్యక్తికి హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్ కేర్ నుండి మాట్లాడుతున్నాం అంటూ కేటుగాళ్లు వీడియో కాల్ చేశారు. ఆ ఫోన్ నిజంగానే బ్యాంకు నుండి వచ్చిందని నమ్మిన వృద్ధుడు వారితో మాట్లాడారు. స్క్రీన్ షేర్ లింక్ పంపిస్తామ‌ని సెట్టింగ్స్ మార్చాల్సి ఉంద‌ని చెప్ప‌డంతో అత‌డు న‌మ్మి అనుమ‌తి ఇచ్చాడు.

త‌ర‌వాత ఐడీ నంబ‌ర్ల‌తో పాటు పాస్ వ‌ర్డ్ ఎంట‌ర్ చేయ‌డంతో లిమిట్ 2.5 ల‌క్ష‌ల‌కు పెరిగింద‌ని 24 గంటల్లో పెరిగిన లిమిట్ అప్డేట్ అవుతుంద‌ని చెప్పి నమ్మించారు. అత‌డు కాల్ క‌ట్ చేసిన వెంట‌నే ఖాతాలో నుండి రూ.2.3 ల‌క్ష‌లు మాయం అయ్యాయి. తిరిగి కాల్ చేసినా లిఫ్ట్ చేయ‌క‌పోవ‌డంతో మోస‌పోయిన‌ట్టు గ్ర‌హించాడు. బాధితుడు సైబ‌ర్ క్రైం పోలీసుల‌ను ఆశ్ర‌యించి ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఇక అచ్చం ఇలాంటి ఘ‌ట‌నే అమీర్పేట్ లో మ‌రొక‌టి చోటు చేసుకుంది. ఓ వృద్ధుడిని డిజిట‌ల్ అరెస్ట్ పేరుతో నేర‌గాళ్లు మోసం చేశారు. మ‌నీలాండ‌రింగ్ పై కేసు న‌మోదైంద‌ని కేసు బుక్ చేయ‌వ‌ద్దంటే రూ.53 ల‌క్ష‌లు పంపాల‌ని అన్నారు. వృద్ధుడు డ‌బ్బు పంపి మోస‌పోయాన‌ని గ్ర‌హించి సైబ‌ర్ క్రైం పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు.

Next Story