- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రెగ్నెంట్ చేసి రూ.25లక్షలు గెలుచుకోవాలంటూ మహిళ బంపరాఫర్.. చివరికి మైండ్ బ్లాక్ ట్విస్ట్
ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోయిన సంగతి తెలిసిందే. కేటుగాళ్లు కొత్త కొత్త దారులను వెతుకుతూ మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ప్రెగ్నెంట్ జాబ్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసి ఓ ముఠా మోసాలకు పాల్పడుతోంది. కాగా ఆ మోసానికి బలై పూణేకు చెందిన 44ఏళ్ల ఓ కాంట్రాక్టర్ రూ.11 లక్షలు పోగొట్టుకున్నాడు.

దిశ, వెబ్ డెస్క్: ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోయిన సంగతి తెలిసిందే. కేటుగాళ్లు కొత్త కొత్త దారులను వెతుకుతూ మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ప్రెగ్నెంట్ జాబ్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసి ఓ ముఠా మోసాలకు పాల్పడుతోంది. కాగా ఆ మోసానికి బలై పూణేకు చెందిన 44ఏళ్ల ఓ కాంట్రాక్టర్ రూ.11 లక్షలు పోగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. సోషల్ మీడియాలో ప్రెగ్నెంట్ జాబ్ అంటూ కాంట్రాక్టర్ కు ఓ ప్రకటన కనిపించింది. ప్రకటన వీడియోలో కనిపించిన మహిళ తనను తల్లిని చేస్తే రూ.25 లక్షలు ఇస్తానని చెప్పింది. తనకు మాతృత్వం ఆనందం కావాలని తెలిపింది.
అంతే కాకుండా దాని కోసం చదువు, కులం, రంగు, పొడవు పొట్టితో సంబంధం లేదని చెప్పింది. దీంతో ఆశపడ్డ కాంట్రాక్టర్ ప్రకటనలోని ఫోన్ నంబర్ కు కాల్ చేసి మాట్లాడారు. కాగా రిజిస్ట్రేషన్ ఫీజు, గుర్తింపు కార్డ్ ఛార్జీలు, ప్రాసెసింగ్ ఫీజు పేర్లతో అతడి వద్ద డబ్బులు వసూలు చేశారు. తరవాత బెదిరించి మరికొంత డబ్బు వసూలు చేశారు. చివరకు మోసపోయానని తెలుసుకున్న బాధితుడు బనేర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు బాధితుడు సెప్టెంబర్ మొదటి వారం నుండి అక్టోబర్ 23 మధ్య మొత్తం రూ.11 లక్షల విలువైన 100 చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ చేశాడని గుర్తించారు. ప్రస్తుతం దీనిపై విచారణ కొనసాగుతోందని తెలిపారు.






