- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ తనిఖీలు.. భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత
శంషాబాద్ విమానాశ్రయంలో రూ.11.86 లక్షల విలువైన విదేశీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) వేదికగా జరుగుతున్న అక్రమ నగదు రవాణాకు కస్టమ్స్ అధికారులు మరోసారి బ్రేక్ వేశారు. విదేశాలకు అక్రమంగా తరలిస్తున్న భారీ విదేశీ కరెన్సీ (Foreign Currency)ని ఇవాళ ఉదయం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. శంషాబాద్ విమానాశ్రయం నుంచి బ్యాంకాక్ (Bangkok) వెళ్లేందుకు సిద్ధమైన సయ్యద్ ఇస్మాయిల్ అలీ అనే ప్రయాణికుడి కదలికలపై భద్రతా సిబ్బందికి అనుమానం కలిగింది. దీంతో కస్టమ్స్ అధికారులు అతడి లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సోదాల్లో నిందితుడు దాచి ఉంచిన విదేశీ కరెన్సీ కట్టలు బయటపడ్డాయి. ఈ మేరకు నిందితుడు సయ్యద్ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న విదేశీ కరెన్సీ విలువ భారత కరెన్సీలో సుమారు రూ.11.86 లక్షలు ఉంటుందని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. సరైన పత్రాలు లేకుండా, పరిమితికి మించి నగదును తరలిస్తున్నందుకు గాను కేసు నమోదు చేసి సయ్యద్‌ను అదుపులోకి తీసుకున్నారు.






