- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Delhi Liquor Scam లో ముగిసిన శరత్ చంద్రారెడ్డి బినయ్ బాబుల కస్టడీ
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరబిందో డైరెక్టర్ పెనక శరత్ చంద్రారెడ్డి, పెర్నోడ్ రికార్డ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ జనరల్ మేనేజర్ బినయ్ బాబును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరబిందో డైరెక్టర్ పెనక శరత్ చంద్రారెడ్డి, పెర్నోడ్ రికార్డ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ జనరల్ మేనేజర్ బినయ్ బాబును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వీరద్దరి కస్టడీ సోమవారంతో ముగియనుంది. దీంతో ఇవాళ సీబీఐ స్పెషల్ కోర్టులో ఈ ఇద్దరిని ఈడీ అధికారులు హాజరుపరచబోతున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టులో శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబును హాజరుపరుస్తారు. ఈ కేసులో ఈడీ వీరిద్దరిని పది రోజులకు పైగా విచారించింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున వీరిద్దరి కస్టడీ పొడిగించాలని గత వారమే ఈడీ అధికారులు కోర్టును ఆశ్రయించగా వారికి నాలుగు రోజుల కస్టడీ ముగిసింది. విచారమ సందర్భంగా అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయని ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఇద్దరిని మరోసారి కస్టడీకి కోరుతుందా లేదా అనేదానిపై ఆసక్తి ఏర్పడింది. కాగా ఈ కేసులో శరత్ చంద్రారెడ్డి భార్య కనికా రెడ్డిని సైతం ఈడీ అధికారులు ప్రశ్నించారు.






