- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు చీఫ్ గెస్ట్‌గా క్రిమినల్.. పది మంది పోలీసులపై వేటు
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఎవరిని పిలుస్తారు? స్వతంత్ర పోరాట యోధులు, గొప్ప నాయకులు, ప్రముఖ సంఘసేవకులు, నిజాయితీ గల అధికారులు, సమాజాన్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయులు కూడా కావొచ్చు. కానీ ఇక్కడ మాత్రం గొప్ప నేరస్తుడిని గెస్ట్‌గా పిలిచారు.

దిశ, వెబ్ డెస్క్ : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఎవరిని పిలుస్తారు? స్వతంత్ర పోరాట యోధులు, గొప్ప నాయకులు, ప్రముఖ సంఘసేవకులు, నిజాయితీ గల అధికారులు, సమాజాన్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయులు కూడా కావొచ్చు. కానీ ఇక్కడ మాత్రం గొప్ప నేరస్తుడిని గెస్ట్‌గా పిలిచారు. అది కూడా పోలీసు స్టేషన్‌లో జరిగిన పంద్రాగస్టు వేడుకలకు ముఖ్య అతిథిగా నేరస్తుడు అటెండ్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టడంతో.. పోలీసులపై వేటు పడింది.
ఉత్తరప్రదేశ్ బారాబంకిలో ఈ ఘటన జరిగింది. కర్సీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఉమ్రా పోలీస్ ఔట్‌పోస్ట్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులు జరిపారు పోలీసులు. అయితే ఇందుకు గెస్ట్‌గా ఆయుధంతో తిరుగుతూ హల్ చల్ చేసి, అరెస్ట్ అయి, జైలుకు వెళ్లిన మహమ్మద్ నయీమ్‌ను పిలిచారు. బెయిల్‌పై విడుదలైన అతనితో.. వేడుకల తర్వాత కలిసి సెల్ఫీ కూడా దిగారు. అయితే నయీమ్ ఈ ఫొటోలను వాట్సాప్ స్టేటస్‌లో పెట్టాడు. దీంతో వైరల్ అయిపోయాయి. కథ ఎస్పీ అర్పిత్ విజయ్ వర్గీయ వరకు వెళ్లడంతో చర్యలు తీసుకున్నారు. అందరినీ మరో పీఎస్‌కు బదిలీ చేయించారు. దర్యాప్తు బాధ్యతలను సర్కిల్ ఆఫీసర్‌కు అప్పగించారు.






