భర్తను చంపి.. క్రిమినల్‌తో ఎఫైర్.. అతన్ని లేపేసి బావతో పెళ్లి.. వ్యతిరేకించిన అత్తను చంపిన మహిళామణి

by Sujitha Rachapalli |   (  Updated:2025-07-02 12:06:25  IST  )

ఈ క్రైమ్ గురించి వింటే సినిమా కథలు కూడా పనికి రావనిపిస్తుంది. గ్వాలియర్‌కు చెందిన రమేశ్‌తో పూజా జతవ్‌కు 2014లో పెళ్లి జరిగింది. ఏడాది తిరగకముందే భర్త హత్య కేసులో కోర్టుకు వెళ్లింది. తనకు తానే కాల్చుకుని చనిపోయాడని

భర్తను చంపి.. క్రిమినల్‌తో ఎఫైర్.. అతన్ని లేపేసి బావతో పెళ్లి.. వ్యతిరేకించిన అత్తను చంపిన మహిళామణి
X

దిశ, వెబ్‌డెస్క్ : ఈ క్రైమ్ గురించి వింటే సినిమా కథలు కూడా పనికి రావనిపిస్తుంది. గ్వాలియర్‌కు చెందిన రమేశ్‌తో పూజా జతవ్‌కు 2014లో పెళ్లి జరిగింది. ఏడాది తిరగకముందే భర్త హత్య కేసులో కోర్టుకు వెళ్లింది. తనకు తానే కాల్చుకుని చనిపోయాడని స్టోరీ అల్లింది. ఈ సమయంలో ఓ క్రిమినల్‌(కళ్యాణ్)తో పరిచయం ఏర్పడింది. ఇద్దరు ముంబైలో సహజీవనం చేశారు. కానీ 2021లో అతను అనుమానాస్పదంగా చనిపోయాడు. ఆ తర్వాత కళ్యాణ్ బ్రదర్‌‌ను పెళ్లి చేసుకుంది. కానీ అప్పటికే ఆయనకు మరో అమ్మాయితో పెళ్లి జరిగింది.

అయితే ఇదంతా పట్టని ఆమె అతనితో కాపురం చేసి ఓ పిల్లకు కూడా జన్మనిచ్చింది. తన భర్త పేరున ఉన్న ఆస్తిలో వాటా కావాలని గొడవకు దిగింది. దీనికి అత్త వ్యతిరేకించడంతో సోదరి, మరో ప్రియుడి సహాయంతో ఆమెకు విషమిచ్చి హత్య చేసి నగలను తీసుకుని పారిపోయింది. జూన్ 24న ఈ ఘటన జరగ్గా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు.. జూలై 2న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఆభరణాలు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఇక కథ వింటుంటే హిందీలో ఏక్తా కపూర్ సిరీస్ చూస్తున్నట్లు ఉందంటున్నారు నెటిజన్లు. ఫ్యామిలీ మొత్తాన్ని నాశనం చేసిందని తిట్టిపోస్తున్నారు.

LINK

Next Story