హైదరాబాద్ రౌడీ షీటర్లకు CP సజ్జనార్ మరో హెచ్చరిక

by Gantepaka Srikanth |

హైదరాబాద్ రౌడీ షీటర్లకు పోలీస్ కమిషనర్ సజ్జనార్(CP Sajjanar) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

హైదరాబాద్ రౌడీ షీటర్లకు CP సజ్జనార్ మరో హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ రౌడీ షీటర్లకు పోలీస్ కమిషనర్ సజ్జనార్(CP Sajjanar) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. శనివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రౌడీషీటర్లను ఉక్కుపాదంతో అణిచివేస్తామని హెచ్చరించారు. ఆయుధాలు పట్టుకుని ప్రజలను ఇబ్బందిపెడితే ఇక నుంచి ఊరుకోం.. సిబ్బందికి నిరంతరం మా సపోర్ట్ ఉంటుందని అన్నారు. పోలీసులపై దాడులు చేస్తే సరైన గుణపాఠం చెబుతామని చెప్పారు.

ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఛాదర్‌ఘాట్ విక్టోరియా ప్లేగ్రౌండ్ వద్ద ఘటన జరిగింది. రౌడీ షీటర్, మొబైల్స్ స్నాచర్ ఇద్దరూ స్నాచింగ్ చేస్తుండగా డీసీపీ చైతన్య పట్టుకునే ప్రయత్నం చేశారు. రౌడీ షీటర్ మమ్మద్ ఉమర్ అన్సారీ మీద 20కి పైగా కేసులు ఉన్నాయి. గతంలో రెండేళ్లు జైల్లో కూడా ఉన్నాడు. దొంగను చేజ్ చేస్తూ పట్టుకునేందుకు డీసీపీ తన గన్ మెన్ వచ్చారు. దొంగ కత్తి తో గన్ మెన్‌పై దాడి చేశాడు. వెంటనే డీసీపీ చైతన్య రెండు రౌండ్లు దొంగపై కాల్పులు జరిపారు. దొంగకు చేతిపై.. కడుపులో గాయాలయ్యాయి. దొంగను మాలకపేట యశోద ఆసుపత్రికి తరలించాము. పరారీ లో ఉన్న మరో దొంగ కోసం గాలిస్తున్నాం. డీసీపీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.. గాయలైన కానిస్టేబుల్‌లు ఇద్దరూ ఆసుపత్రిలో క్షేమంగా ఉన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తాం. నేరస్తులను సహకరిస్తున్న వారిపైనా ఆరా తీస్తాం.. అందరికీ తగిన గుణపాఠం చెబుతాం అని సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Next Story