బ్రేకింగ్.. బైక్‌తో సహా మత్తడి‌లో కొట్టుకుపోయిన ప్రేమ జంట

by Malleboina Mahesh |   (  Updated:2025-10-30 08:18:35  IST  )

మొంథా తుపాను ఎఫెక్ట్ ఉమ్మడి వరంగల్ జిల్లాపై అధికంగా ఉంది. గంటల వ్యవదిలోని సెంటి మీటర్ల వర్షపాతం నమోదు కావడం తో చిన్న చితక వాగుల నుంచి నదుల వరకు పొంగి పోర్లుతున్నాయి.

బ్రేకింగ్.. బైక్‌తో సహా మత్తడి‌లో కొట్టుకుపోయిన ప్రేమ జంట
X

దిశ, వెబ్ డెస్క్/వరంగల్ బ్యూరో: మొంథా తుపాను ఎఫెక్ట్ ఉమ్మడి వరంగల్ జిల్లాపై అధికంగా ఉంది. గంటల వ్యవదిలోని సెంటి మీటర్ల వర్షపాతం నమోదు కావడం తో చిన్న చితక వాగుల నుంచి నదుల వరకు పొంగి పోర్లుతున్నాయి. దీంతో జనగామ జిల్లాలో ఎక్కడ చూసిన వరదలే దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో మత్తడిని దాటేందుకు ప్రయత్నించిన ప్రేమ జంట బైక్‌తో పాటు వరదలో కొట్టుకుపోయింది. ఈ షాకింగ్ ఘటన జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం తిమ్మంపేట శివారులో చోటు చేసుకుంది. బరిగెల శివకుమార్, బక్క శ్రావ్య ఇద్దరు బైక్ వెళ్తుండగా.. బోళ్ల మత్తడి ప్రవాహం అధికంగా ఉండటంతో ఇద్దరు నీటిలో పడి పోయారు. అయితే శివ కుమార్ మాత్రం చెట్టు కొమ్మను పట్టుకుని ప్రాణాలతో బయటపడగా.. శ్రావ్య నీటిలో కొట్టుకుపోయింది.

ఈ సమాచారం అందుకున్న సమాచారం తెలుసుకున్న పోలీసులు బొల్లా ముత్తడి వద్దకు చేరుకుని 30 మంది ఎస్డిఆర్ఎఫ్ బృందావలతో గాలిస్తున్నారు. యువతి హనుమకొండలోని వాగ్దేవి డిగ్రీ కళాశాలలో చదువుతున్నట్లు సమాచారం. యువతి తల్లిదండ్రులు హైదరాబాదులోని ఓ పౌల్ట్రీ ఫామ్ లో పనిచేస్తూ అమ్మాయిని ప్రైవేట్ హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారు. యువతి మృతదేహం దొరికితే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలుపుతున్నారు. యువతి, యువకులు ప్రేమికులని తెలుస్తోంది.





Next Story