తిరుమలగిరిలో నకిలీ కరెన్సీ కలకలం

by Batti.Sumithra |

సూర్యాపేట జిల్లాలో నకిలీ కరెన్సీ నోట్లు చలామణి అవుతున్నట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది.

తిరుమలగిరిలో నకిలీ కరెన్సీ కలకలం
X

దిశ, తిరుమలగిరి : సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో నకిలీ కరెన్సీ నోట్లు చలామణి అవుతున్నట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఓ కర్రీ పాయింట్ వద్ద అపరిచిత వ్యక్తి 500 రూపాయల నకిలీ నోటు ఇచ్చి వెళ్లిన ఘటన కలకలం రేపింది. దుకాణదారుడు గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలనలో నకిలీ నోట్లు ఇచ్చిన వ్యక్తి ఇతర రాష్ట్రానికి చెందినవాడిగా గుర్తించినట్లు తెలుస్తోంది. రద్దీ ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద నోట్లను స్వీకరించవద్దని పోలీసులు ప్రజలను హెచ్చరించారు.

Next Story