ఆదిలాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని వెనుక నుంచి ఢీకొట్టిన కంటైనర్

by Gantepaka Srikanth |

ఆదిలాబాద్‌(Adilabad) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది.

ఆదిలాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని వెనుక నుంచి ఢీకొట్టిన కంటైనర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆదిలాబాద్‌(Adilabad) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. అతివేగంగా వచ్చిన ఓ కంటైనర్ వెనుక నుంచి లారీని బలంగా ఢీకొట్టింది. గుడిహత్నూర్ మండలం సీతగొంది గ్రామం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. మంటల్లో లారీ, కంటైనర్ రెండూ కాలిపోయాయి. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఫైర్ సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చి మంటలు ఆర్పుతున్నారు. రోడ్డు ప్రమాదం కారణంగా దాదాపు ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. డ్రైవర్లు, క్లీనర్లు వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story