లేడీ కానిస్టేబుల్‌తో కానిస్టేబుల్ ఎఫైర్.. భర్తకు షాకిచ్చిన భార్య!

by Disha Web Desk 7 |
లేడీ కానిస్టేబుల్‌తో కానిస్టేబుల్ ఎఫైర్.. భర్తకు షాకిచ్చిన భార్య!
X

దిశ, వెబ్‌డెస్క్ : చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే గీత దాటుతున్నారు. బాధితులకు న్యాయం అందించాల్సిన చోటే.. అన్యాయాలకు పాల్పడుతున్నారు. భార్య గర్భవతిగా ఉన్నదని ఓ కానిస్టేబుల్ మరో లేడీ కానిస్టేబుల్‌తో ఎఫైర్ పెట్టుకున్నాడు. ఇల్లాలిని పుట్టింటికి పంపించి ఎంజాయ్ చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న భార్య న్యాయం చేయాలని ఆందోళనకు దిగిన ఘటన వికారాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. స్థానికుల కథనం ప్రకారం..

వికారాబాద్ జిల్లాకు చెందిన శ్రీశైలం ఏఆర్ కానిస్టేబుల్‌గా మాదాపూర్‌లో పని చేస్తున్నాడు. ఆయనకు 2021లో ఓ యువతితో వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె గర్భవతి. అయితే హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న శ్రీశైలం స్థానికంగా ఓ మహిళా కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు ఆయన భార్య ఆరోపిస్తోంది. తనను పుట్టింటికి పంపించి ఆమెతో ఎఫైర్ కొనసాగిస్తున్నాడని పరిగి మండలం తొండవల్లిలోని భర్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. తనను భర్త మోసం చేశాడని, న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె బంధువులతో కలిసి ఇంటి ఎదుట బైటాయించింది. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed